బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఆదివారం మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. మినీ స్టేడియంలో క్రీడాకారులు, సీనియర్ సిటిజన్స్ ను కలిసి నాగర్ కర్నూల్ ప్రాంతంలో దశాబ్దాలుగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కూరగాయల మార్కెట్ లో చిరు వ్యాపారులకు కలిశారు.మార్కెట్ లో హమాలీల కష్టాలు తెలుసుకోవడం కోసం బరువైన బస్తాలు మోసారు.స్థానిక ప్రజలతో మమేకమవుతూ ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా,గాంధీ చౌరస్తా, రామాలయం చౌరస్తా లో మార్నింగ్ వాక్ చేశారు.

ఆయనతోపాటు మార్నింగ్ వాక్ లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ మీడియా ఇంచార్జి అభిలాష్ రావు,మాజీ జెడ్పీటీసీ కట కాటం జమ్ములయ్య, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, బీసీ నాయకులు కట్ట శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »