నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!
జ్ఞాన తెలంగాణ సిద్ధిపేట జిల్లా ప్రతినిది.

అప్పనపల్లి గ్రామానికి చెందిన దుబాసి భాను తండ్రి బిక్షపతి (24) అతను రాత్రి 9 గంటలకు తిమ్మాపూర్ గ్రామంలో తన చెల్లెలు రిసెప్షన్ ఉన్నదని తన మోటార్ సైకిల్ టీఎస్ 36 జి-7890 పై వెళ్లి రాత్రి 11:50 గంటల సమయంలో తిమ్మాపూర్ నుండి తోర్నాల మీదుగా అప్పనపల్లి వెళ్ళుచుండగా తోర్నాల గ్రామ శివారు చింత చిన్న కుంట వద్ద తోర్నాల గ్రామస్తులు వాసూరి యాదయ్య తండ్రి మల్లయ్య, వాసూరి తిరుపతి తండ్రి గుట్టయ్య ఇద్దరు రోడ్డుపై వడ్ల కుప్పలు పోసి దానిపై నల్ల కవర్ కప్పి చుట్టూ బండరాళ్లు పెట్టారు.
భాను, రాత్రి సమయంలో అది కనపడక వడ్ల కుప్పకు ఢీకొని రాళ్లపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరు వ్యక్తుల నిర్లక్ష్యంగా రోడ్డుపై వడ్ల కుప్పలు పోసి ఎలాంటి సూచికలు లేకుండా కనబడకుండా నల్ల కవర్లు కప్పినందున తన తమ్ముడు వడ్ల కుప్పలకు డీకొని రాళ్లపై పడి చనిపోవడానికి కారణమైన ఇద్దరి వ్యక్తులపై చట్ట పరమైన చర్య తీసుకోవాలని భాను అన్న దుబాసి ప్రశాంత్ తండ్రి బిక్షపతి, సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఏఎస్ఐ పోచ గౌడ్ కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.
రైతులు ఎవరైనా వారి ధాన్యాన్ని రోడ్లపై పోయవద్దని నిర్లక్ష్యంగా రోడ్లపై పోసి రోడ్డు ప్రమాదాలకు వ్యక్తుల మరణాలకు కారణమవుతున్నారని రోడ్లపై ధాన్యాన్ని పోసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను హెచ్చరించారు.
