ఇద్దరు తగ్గట్లేదు గా!

ఇద్దరు తగ్గట్లేదు గా!
జ్ఞాన తెలంగాణ, హనుమకొండ:

చిరకాల రాజకీయ ప్రత్యర్థుల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. రెండు శతాబ్దాలకు పైగా ఒకే నియోజకవర్గంలో శత్రువులుగా ఉన్న ఇద్దరూ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వారే ఉమ్మడి వరంగల్ జిల్లా కు చెందిన మాజీ ఉపముఖ్యమంత్రులు కడియం శ్రీహరి,తాటికొండ రాజయ్య పార్లమెంట్ ఎన్నికల వేల ఇద్దరు మాజీ ఉపముఖ్యమంత్రులు ఒకరిపై ఒకరు విమర్శల దాడి మొదలుపెట్టారు. ఎన్నికల ప్రచార వేదికలపై ఒకరిపై ఒకరు మాటల దాడులకు దిగుతున్నారు. కబడ్డీ ఆడుతానని రాజయ్య అంటే… దళిత బంధులో అవినీతిపరుని అంతు చూస్తానంటూ కడియం శ్రీహరి అంటున్నారు. ప్రత్యర్థులుగా ఒకే నియోజకవర్గంలో కడియం శ్రీహరి,తాటికొండ రాజయ్య స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో 25 సంవత్సరాల రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగుతూ వస్తున్నారు. ఇద్దరు నేతలు స్టేషన్ ఘన్పూర్ నుండి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. కడియం శ్రీహరి టిడిపి నుండి ప్రారంభించగా,తాటికొండ రాజయ్య కాంగ్రెస్ నుండి ప్రారంభించారు. ఇద్దరు ఒక నియోజకవర్గం కావడంతో రాజకీయ ప్రత్యర్ధులుగా మారుతూ వచ్చారు. అయితే ఇద్దరూ 2010 వరకు వేరువేరు పార్టీలో ఉన్న కడియం శ్రీహరి, రాజయ్యలు రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారు. అయితే 2009 ఎన్నికల్లో కడియం శ్రీహరి పై రాజయ్య గెలుపొందిన తర్వాత, 2012 ఉప ఎన్నిక, 2014, 2018 సార్వత్రిక ఎన్నికల్లో రాజయ్య గెలుపొందారు. రాజయ్య 2014లో తెలంగాణ తొలి డిప్యూటీ సీఎం పదవి వరించింది. ఏడాది లోగా రాజయ్యను డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించి, కడియం ఉప ముఖ్యమంత్రిగా చేయడంతో అప్పటినుండి ఇద్దరి మధ్యలో వార్ మొదలైంది. మళ్లీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌ అధినేత కేసీఆర్ రాజయ్య ను కాదని శ్రీహరికి టికెట్ ఇచ్చారు. అయితే రాజయ్య బీఆర్‌‌ఎస్‌ను వదిలి కాంగ్రెస్ తో సంప్రదింపులు జరిపారు. తర్వాత కడియం శ్రీహరి కూతురు బీఆర్‌‌ఎస్‌ ఎంపీ టికెట్ కేటాయించగా కొన్ని రోజుల తర్వాత కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరారు. అయితే రాజయ్య మళ్ళీ బీఆర్‌‌ఎస్‌లోకి వెళ్లి ఎంపీ టికెట్ వస్తుందని అనుకున్నారు.కేసీఆర్ మాత్రం హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్ వైపే మొగ్గు చూపారు. అనంతరం రాజయ్య కడియం పై సవాల్ చేస్తూ బిఆర్ఎస్ నుండి వెళ్లిన కడియం శ్రీహరి రాజీనామా చేసి కాంగ్రెస్ తరపున పోటీ చేయాలని సవాల్ విసిరారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది.

You may also like...

Translate »