జిల్లా ఆసుపత్రిలో గర్భిణి స్త్రీ మృతి

జిల్లా ఆసుపత్రిలో గర్భిణి స్త్రీ మృతి

ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు
డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని ఆరోపణ
ఙ్ఞాన తెలంగాణ, నారాయణ పేట:
నారాయణపేట జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల గర్భిణి మహిళ మృతి చెందింది. మద్దూర్ మండలం భీంపూర్ గ్రామానికి చెందిన గోవిందమ్మ కాన్పు కొరకు జిల్లా ఆసుపత్రిలో చేరారు. ఆపరేషన్ చేస్తున్న క్రమంలో గుండెపోటు రావడంతో మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు.డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఆమె మృతి చెందినట్లు వారు తెలిపారు. సరైన చికిత్స అందించకపోవడం వల్లే మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్‌డెంట్ రంజిత్ అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.