జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్‌కు .. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు..

జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్‌కు .. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు..

జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌కు తెలంగాణ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. తెలంగాణ‌తో పాటు పుదుచ్చెరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా కూడా ఆయ‌నే బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. త‌మిళిసై రాజీనామా నేప‌థ్యంలో ఇవాళ రాష్ట్ర‌ప్ర‌తి భ‌వ‌న్ ఈ విష‌యాన్ని ఓ ప్రెస్ రిలీజ్ ద్వారా తెలిపింది. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై రాజీనామాను రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోదించారు.

పుదుచ్చెరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా కూడా రాధాకృష్ణ‌న్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లను అప్ప‌గించారు. పూర్తి స్థాయి గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించే వర‌కు తెలంగాణ‌, పుదుచ్చెరి బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించాల‌ని రాధాకృష్ణ‌న్‌ను కోరుతూ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఓ లేఖ రిలీజ్ చేసింది. బాధ్య‌త‌లు స్వీక‌రించిన క్ష‌ణం నుంచి నియామ‌కం అమ‌లులోకి వ‌స్తుంద‌ని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ఆ రిలీజ్‌లో తెలిపింది.

You may also like...

Translate »