కాంగ్రెస్ గూటికి అల్లు అర్జున్ మామా చంద్రశేఖర్ రెడ్డి.

కాంగ్రెస్ గూటికి అల్లు అర్జున్ మామా చంద్రశేఖర్ రెడ్డి.

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్‌ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి భారాస ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి, వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతా, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌, ఆయన భార్య చర్లపల్లి భారాస కార్పొరేటర్‌ శ్రీదేవి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీప్‌దాస్‌ మున్షీ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం చంద్రశేఖర్‌రెడ్డితో పాటు నేతలంతా అసెంబ్లీకి వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు.

నాగార్జున సాగర్‌ టికెట్‌ ఆశించిన చంద్రశేఖర్‌రెడ్డి

నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో చంద్రశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారాస నుంచి నాగార్జునసాగర్‌ టికెట్ ఆశించారు. తన గెలుపు కోసం బన్నీ ప్రచారం చేస్తాడని కూడా ప్రకటించారు. కానీ, భారాస టికెట్‌ ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు.

You may also like...

Translate »