2023-24 కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ వాటా ఎంత

2023-24 కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ వాటా ఎంత
రూ.47,65,768 కోట్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో పన్నుల వాటా కింద తెలంగాణకు రూ.23,400 కోట్లు
హైదరాబాద్ ఫిబ్రవరి 02: కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది రూ.47,65,768 కోట్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఎలాంటి కొత్త పథకాలు వరాలు వాతలు లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు ఓ సారి పరిశీలిస్తే కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.25,639 కోట్లు రానున్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో పన్నుల వాటా కింద తెలంగాణకు రూ.23,400 కోట్లు కేటాయించారు.ఈసారి మరో రూ.2,239 కోట్లను పెంచింది ఇక కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రానికి రూ.19,760.59 కోట్లు రానున్నాయి ఇక 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు స్థానిక సంస్థల గ్రాంటు కింద రాష్ట్రానికి మరో రూ.3,200 కోట్లు రానున్నాయి.
ఈ మూడు పెద్ద పద్దులు తప్ప రాష్ట్రానికి ఈసారి చెప్పుకోదగ్గ కేటాయింపులు ఏమీలేవు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం స్టీల్ ప్లాంట్లకు నిధులు కేటాయించాలని వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద మూడేళ్లకు సంబంధించిన రూ.1800 కోట్లను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కూడా అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గతంలో కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి కూడా చేశారు ఈ అనుమతులిస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయని ఆశించారు.
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి మెట్రో రైలు రెండో దశకు నిధులి వ్వాలని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి రూ.88 కోట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి రూ.90 కోట్ల చొప్పున అదనంగా కేటాయించాలని కోరింది కానీ మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం వీటికి ఎలాంటి భరోసా ఇవ్వలేదు.