స్వేరోస్ ఆధ్వర్యంలో ఘనంగా చదువుల తల్లి సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు….

స్వేరోస్ ఆధ్వర్యంలో ఘనంగా చదువుల తల్లి సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు….
చదువుల తల్లి సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు బెజ్జంకి మండల కేంద్రంలోని పూలే దంపతుల విగ్రహాలకు స్వేరో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొర్ర సురేష్ కుమార్ గారు పూలమాలలు వేసి నివాళులు అర్పించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి హాజరైన జూనియర్ కాలేజ్, మరియు బాలుర పాఠశాల మహిళ అధ్యపకులు హిమబిందు, శ్రీలత, మాలతి, కవిత, సబియా సుల్తానా గారు లను శాలువతో సత్కరించి సన్మానించారు, పాల్గొన్న విద్యార్థిని, విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు

ఈ సందర్బంగా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ హిమబిందు గారు మాట్లాడుతూ సావిత్రి భాయి పూలే గారి జీవితం నేటి తరానికి స్ఫూర్తి కావాలని కోరారు, ఈ కార్యక్రమంలో స్థానిక విద్యాలయాల ఉపాద్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని సావిత్రి భాయి పూలే గారికి నివాళులు అర్పించి జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్వేరో జిల్లా నాయకులు ఉప్పులేటి బాబు, BSP నాయకులు పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్, యువజన నాయకులు కొత్త రాజ్ కుమార్, స్వేరో నాయకులు మాంకాలి నగేష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.