హిట్ అండ్ ర‌న్ చ‌ట్టం ఆందోళ‌న విర‌మించిన ట్ర‌క్ డ్రైవ‌ర్లు.

హిట్ అండ్ ర‌న్ చ‌ట్టం ఆందోళ‌న విర‌మించిన ట్ర‌క్ డ్రైవ‌ర్లు.

హైదరాబాద్ జనవరి 02:ఆయిల్ ట్యాంకర్ల యజమా నులు ఆందోళ‌న‌ను విరమించారు కేంద్ర ప్రభుత్వం తీసు కొచ్చిన కొత్త చట్టాలలో హిట్ అండ్ రన్ కేసులకు శిక్ష పెంపుపై నిరసిస్తూ తెలంగాణలో పెట్రోల్‌ ఆయిల్‌ ట్యాంకర్ల యజ మానులు నిర‌స‌న నిరసన వ్యక్తం చేశారు.తాజాగా ఆ ఆందోళ‌న‌ను విరమించారు ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ఆందోళ నతో పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోయింది దీంతో ఇంధన కొరత ఏర్పడు తుందేమోని ఆందోళనకు గురైన వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు.అయితే ట్రక్కు డ్రైవర్ల ధర్నా విరమించడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు హిట్‌ అండ్‌ రన్‌ కేసులకు సంబంధించి కఠిన నిబంధనలు చేర్చడంతో వివిధ ప్రాంతాల్లో ట్రక్కు డ్రైవర్లు రాస్తా రోకోలు ర్యాలీలు నిరసనలకు దిగారు.

మహారాష్ట్ర హిమాచల్‌ ప్రదేశ్‌ మధ్యప్రదేశ్‌ జమ్మూ కశ్మీర్‌ పంజాబ్ వంటి రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల ముందు భారీగా వాహనాలు క్యూ కట్టాయి. వీటికి సంబం ధించిన వీడియోలు సామా జిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమోదించిన భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ కేసుల్లో దోషిగా నిర్దారణ అయితే పదేళ్ల జైలు శిక్ష రూ.7 లక్షల వరకు జరిమానా విధిస్తారు.ఈ కొత్త నిబంధనలో రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు ఘటన జరిగిన తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వకుం డా పారిపోతే గరిష్ఠంగా ఈ శిక్ష విధించాలని పేర్కొన్నారు.ఈ నిబంధనను ట్రక్కులు, లారీలు ప్రైవేటు బస్సు డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు దీని వల్ల కొత్త వారు ఈ డ్రైవింగ్ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

You may also like...

Translate »