ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా ఐఏఎస్ దాసరి హరిచందన..

ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారిగా ఐఏఎస్ దాసరి హరిచందన..

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఆయుష్ డైరెక్టర్ దాసరి హరిచందనను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్గా నియమించింది. దీంతో పాటు ప్రజావాణికి స్టేట్ నోడల్ ఆఫీసర్ గా కూడా నియమిస్తూ సీ స్ శాంత కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ కె. నిర్మలను జీఏడీలో సర్వీసెస్, జీపీఎం, ఏఆర్టీలో నియమించారు.

ఈరోజు ప్రజావాణిలో పాల్గొననున్న పొన్నం

బేగంపేటలోని ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భవన్ లో ప్రజా వాణి కార్యక్రమం జరగనుంది.

You may also like...

Translate »