ఎంపీ గా రాజీనామా సమర్పించిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు

ఎంపీ గా రాజీనామా సమర్పించిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు
శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మెదక్ పార్లమెంటు సభ్యుడిగా రెండు పర్యాయాలు చేసి, 2023 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలలో దుబ్బాక నుండి ఎమ్మెల్యే గా పోటి చేసి గెలిచిన సందర్భంగా.. మెదక్ పార్లమెంటు సభ్యుడిగా లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు తన సభ్యత్వాన్ని ఉపసంహరించు కుంటు రాజీనామా పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మెదక్ ఎంపిగా తాను ప్రజలకు చేసిన సేవలు,అభివృద్ధి పనులు, 10 ఏళ్ళు గా పార్లమెంట్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు..ఈ క్రమంలో రెండు సార్లు భారీ మెజార్టీ తో గెలిపించి సేవ చేసుకునే అవకాశం కల్పించిన మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.