తెలంగాణ రైతులకు శుభవార్త

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతులకు పంట పెట్టుబడి సాయం చెల్లింపులు ప్రారంభించాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ట్రెజరీ నిధులు విడుదల చేయనుండటంతో సుమారు 70 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందనుంది. కేసీఆర్ ప్రభుత్వంలో రైతుబంధు పేరుతో పంట పెట్టుబడి సాయాన్ని అందించారు. అయితే కొత్త ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా విధివిధానాలను ఖరారు చేయలేదు. దీంతో ప్రస్తుతానికి గతంలోని విధివిధానాల ప్రకారమే పెట్టుబడి సాయం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

You may also like...

Translate »