విద్యను వ్యాపారం చేసినోల్లకే మంత్రి పదవులు:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
కేసీఆర్,కేటీఆర్ కనుసన్నల్లోనే నకిలీ వర్సిటీలు
కాకతీయ వర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్ల అవకతవకలపై విచారణ జరపాలి

ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా “ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు.
రాష్ట్రంలో విద్యను వ్యాపారంగా చేసుకుని కోట్ల రూపాయలకు ఇంజనీరింగ్,మెడిసిన్ సీట్లు అమ్ముకున్నోళ్లకే ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవులు కట్టబెట్టారని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.కాకతీయ వర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని గత 29 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న వర్సిటీ విద్యార్థులకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో వర్సిటీలన్నీ పోలీసు నిర్బంధంలో కొనసాగుతున్నాయన్నారు.కేసీఆర్,కేటీఆర్ ల కనుసన్నల్లోనే రాష్ట్రంలో నకిలీ వర్సిటీల ఏర్పడ్డాయని అన్నారు. గురునానాక్,శ్రీనిధి, కావేరీ వంటి ఇంజనీరింగ్ కాలేజీలు నకిలీ యూనివర్సిటీల పేరుతో వేలాది మంది విద్యార్థులకు అడ్మీషన్లు ఇచ్చి,ఘోరంగా మోసం చేశాయన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలియకుండ రాష్ట్రంలో నకిలీ యూనివర్సిటీలు వెలిశాయా అని ప్రశ్నించారు.
కాకతీయ వర్సిటీ నిర్వహించిన పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష మార్కుల వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి సబితకు,మంత్రి మల్లారెడ్డికి పీహెచ్‌డీ విలువలు తెలియదన్నారు. వర్సిటీ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.వర్సిటీలో అక్రమాలు జరిగితే ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఏం చేస్తున్నట్లని ప్రశ్నించిన ఆయన తక్షణమే విద్యాశాఖ మంత్రిని మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

మూడు లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో వర్సిటీలకు ఎంత బడ్జెట్ కేటాయించారో వాటి వివరాలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.విద్యార్థులు రాజకీయ నాయకులు కాకూడదనే కుట్రతో కేసీఆర్ వర్సిటీలపై పోలీసు నిర్బంధం కొనసాగిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఎన్నడూ వర్సిటీలను సందర్శించలేదని విమర్శించారు. వర్సిటీ తరగతి గదుల్లో, ప్రయోగశాలల్లో ఉండాల్సిన పీహెచ్డీ విద్యార్థులు రోడ్లపై ధర్నాలు చేస్తున్నారని అన్నారు.

పిరికిపందల్లా ప్రగతి భవన్ లో కూర్చొని పాలన కొనసాగిస్తూ,పోలీసుల రక్షణ లేకుండా కేసీఆర్,కేటీఆర్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కె.యూ.జాక్ చైర్మన్ తిరుపతి యాదవ్ నాయకులు గుగులోత్ రాజు నాయక్,గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి,నిమ్మల రాజేష్,మాచర్ల రాంబాబు,అరెగంటి నాగరాజు,మట్టెడ కుమార్ ఎండి పాషా మంద నరేష్ బొట్ల మనోహర్ కేతపాక ప్రసాద్ జగదీశ్వర్ ప్రశాంత్ శివాజీ విజయ్ రమేష్ జగన్, తెల్లూరి సురేష్ పార్టీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి గుండాల మదన్ కుమార్ బీఎస్పీ రీజియన్ సెక్రటరీ కన్నం సునిల్, వరంగల్,హన్మకొండ జిల్లా అధ్యక్షులు మంద శ్యామ్, శనిగరపు రాజు, వర్దన్నపేట నియోజకవర్గం ఇంచార్జి
మాదారపు రవికుమార్, వడ్డేపల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.