ఆసియాన్ గేమ్స్ లో సత్తా చాటిన నందిని ఎవరు?

ఎవరీ నందిని?
చాయ్ వాలా కూతురు ఏషియన్ గేమ్స్ లో ఆడే స్థితికి ఎలా వెళ్ళింది?
ఇది తెలంగాణ ప్రభుత్వం విజయమా?
అప్పటి గురుకుల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి విజయమా?

ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం.
డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు అత్యంత ప్రతిభకల్గినటువంటి విద్యార్థులను వెలికి తీసి వారిలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి శక్తినివారికే పరిచయం చేసి నచ్చినటువంటి దారిలో వెళ్లడానికి అవకాశాలు సృష్టించాడు.
ఆకలి దప్పికలతో,  అంటరానితనంతో అడుగడుగున వెలివేయబడుతున్నటువంటి పేద బిడ్డల గుండెల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపటానికి అనునిత్యం కృషి చేశాడు.
పగలు రాత్రి ఎండ వాన తేడా లేకుండా కంటికి రెప్ప లాగ,లక్షలాది బిడ్డలను సొంత బిడ్డల్లా చూసుకున్నాడు.
మేము ఎవరి కంటే తక్కువ కాదు మేము దేన్నైనా సాధించగలమనేటటువంటి బలమైన నమ్మకాన్ని నూరి పోశాడు.


గురుకులాల్లో చదివిన ఎంతో మంది ఉన్నంతంగా సెటిల్ అయ్యిన పూర్వ విద్యార్థుల తో స్వేరోస్ అనే గొప్ప సంస్థను నెలకొల్పి వారి చెమట చుక్కలను డబ్బులుగా మర్చి ఈ పేద బిడ్డల జీవితాలను సమూలంగా మార్చే దేశగా అడుగులు వేశారు.
ఆయన బ్రెయిన్ లో పుట్టిన ప్రతి ఆలోచనను ఆచరణలో పెట్టాడు, తరతరాలుగా అణిచివేయబడుతున్న జాతులను అక్షర జ్ఞానంతో విజ్ఞులుగా, విశ్వవిజేతలుగా తీర్చిదిద్దడం మొదలెట్టాడు.
వేల ఏళ్లుగా వెలివేయబడిన ఈ జాతులకు జ్ఞాన నిర్దేశకుడై  ప్రపంచానికి పరిచయం చేశారు,
ఇలా లక్షలాది బిడ్డలను  వారికి నచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్లేటట్టుగా అవకాశాలు సృష్టించాడు,
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సైతం ఆయన ఆలోచనలను కాదన లేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాడు.
ఐపీఎస్ ఆఫీసర్ సెక్రెటరీగా రావడం అనేది పెద్ద తప్పిదంగా భావించే ఆ రోజుల్లో మనస్ఫూర్తిగా ఉద్యోగాన్ని ఉద్యమంలో చేశాడు,
ఐఐటిలు,ఎన్ఐటిలు,మొదలైన స్పెషల్ కోచింగ్ లతో కలలో సైతం సాధ్యం కానీ అద్భుతమైన అవకాశాలను సృష్టించి నిరుపేద బిడ్డలను డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా తయారు చేయగలిగాడు,


వీళ్ళందరికీ ఊపిరి పోయడానికి  13 ఏళ్ల బాలిక మలావత్ పూర్ణ,  సాధన పల్లి ఆనంద్ ఇద్దరిని ప్రయోగాత్మకంగా ప్రపంచంలోకెల్లా ఎత్తైనటువంటి శిఖరం ఎవరిష్ట శిఖరాన్ని ఎక్కించాడు, మేము ఎవరి కంటే తక్కువ కాదు అనేటటువంటి గొప్ప సంకల్పాన్ని ఈ విజయంతో లక్షలాది బిడ్డల్లో నూరు పోశాడు.
ఆ సంకల్పమే నేడు నందిని లాంటి ఎంతోమంది బిడ్డలకు ఆదర్శమై విశ్వ విజేతలను చేసే స్థితికి చేర్చింది.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు
అణగారిన జాతులలో ఉన్నటువంటి ఆత్మ న్యూనత భావాన్ని  తొలగించి అక్షర జ్ఞానంతో ఉన్నత జ్ఞాన శిఖరాలను చేరే మార్గాలను చూపించాడు.
స్పోర్ట్స్ స్కూల్స్, కోడింగ్ స్కూల్స్, సైనిక్ స్కూల్స్,  మొదలైన ఎన్నో పాఠశాలలకు ఊపిరి పోసింది ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రమే.
ఆయన శక్తినంత ధారబోసి తన జ్ఞానంతో ఈ పేద జాతులకు అవకాశాలు సృష్టించిపెట్టాడు.
ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పసి బిడ్డలకు పెళ్లిళ్లు చేసి వాళ్ళ జీవితాలను  బుగ్గిపాలు చేస్తున్నారని గ్రహించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
ఇప్పుడు గురుకులల్లో కొనసాగుతున్న డిగ్రీ కళాశాలలు సైతం ఆయన కృషి ఫలితమే,
మహిళా డిగ్రీ కళాశాలలను ఎంతో శ్రమ కూర్చి గురుకులాల్లో పెట్టించగలిగాడు ఇప్పుడు అందులో వేలాది బిడ్డలు గొప్పగా చదువుకుంటున్నారు.
డిగ్రీ కళాశాలలే కాదు లా కళాశాలలు కూడా తీసుకురావడం జరిగింది.
ఎర్ర బస్సు సైతం ఎక్కని పేద బిడ్డలను ఎయిర్ బస్సు నడిపే స్థితికి తెచ్చారు వారు,
స్వేరోస్ అనే బలమైన ఆయుధమే ఈ బిడ్డలను ఉన్నతంగా తీర్చిదద్దగలిగింది.
ఇలా ఒకటి కాదు ఎన్నో ప్రయోగాలు ఎన్నో అద్భుతాలు ఎన్నో విజయాలు, వీటన్నిటికీ కారణం స్వేరోస్ 10 కమాండ్మెంట్స్ మాత్రమే.

డా “ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురుకులాల ను వదిలి నేటికీ రెండున్నర సంవత్సరాలు కావొస్తుంది అయినా అయన ఆనవాళ్లు మాత్రం పసి హృదయాల్లో నిలిచే ఉన్నాయి.
అయన చతురత తో సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, మైనారిటీ సంక్షేమ గురుకులాలకు ఉమ్మడి పరీక్షలు పెట్టి జులై లోపు సీట్లు ననింపేవారు, ఇప్పుడు సెప్టెంబర్ పోయి అక్టోబర్ వచ్చిన 6 నెలలు అకాడమిక ఇయర్ గడిచి పోయిన అన్ని స్కూల్ లల్లో సీట్లు ఇంకా కాళీ గానే ఉండటం గమనించవొచ్చు.

ఈ 10 కమాండ్మెంట్స్ చదవడం వల్ల ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం పెరిగి   చేసే పనిలో అత్యంత ప్రతిభ కనబరిచి ఉన్నత విజయాలు అధిరోహించగలిగారు.

కానీ ఎప్పుడైతే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన పదవికి రాజీనామా చేశారో అప్పటినుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్ కుమార్ గారి ఆనవాళ్లను చెరిపే ప్రయత్నం మొదలెట్టింది.
ఒకవైపు 10 కమాండ్మెంట్స్ ని తొలగించింది,  వారు ఉన్నప్పుడు మహనీయుల ఘనమైన చరిత్రను ప్రతి ఒక్కరికి తెలియజేయాలని  మహనీయుల ప్రతిజ్ఞ ద్వారా ప్రతి విద్యార్థిని మహశక్తివంతులుగా తయారు చేసే ప్రయత్నం చేశారు,  కానీ నేడు ఆ ప్రతిజ్ఞలు పూర్తిగా గురుకులాల నుంచి తీసివేయబడ్డాయి.
ఒక విధంగా చెప్పాలంటే  ఈ అణగారిన పేద బిడ్డల అభివృద్ధిని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే అంధకారం లోని నెట్టింది.
ఏది ఏమైనా నాడు పూర్ణ ఎవరెస్టు శిఖరం ఎక్కిన,  నేడు నందిని ఆసియా క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆ క్రెడిట్ పూర్తిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి చెందుతుంది.

ఇలాంటి గొప్ప గొప్ప విజయాలు సొంతం చేసుకోవాలంటే గురుకుల పాఠశాలలో మళ్ళీ 10 కమాండ్మెంట్స్ పొందుపరచాల్సిందే నని ఎంతోమంది మేధావులు సెలవిస్తున్నారు.

ఏది ఏమైనా ఇంతటి గొప్ప విజయాన్ని మనకు అందించినటువంటి, నందిని స్వేరో గారికి అభినందనలు తెలియజేద్దాం.

You may also like...

Translate »