హైదరాబాద్ నడిబొడ్డున బహుజన మహిళా గర్జన సభ

బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్ నర్రా నిర్మల గారు

బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 29 న హైదరాబాద్ నడిబొడ్డున వెలది మహిళా మణులతో బహుజన మహిళా గర్జన సభ ను నిర్వహిస్తున్నట్టు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర మహిళా కన్వీనర్ నర్రా నిర్మల గారు తెలిపారు.
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి బహెన్రీ మాయావతిగారు డిమాండ్ చేసినట్టు మహిళారిజర్వేషన్ బిల్లులో మహిళలకు 33శా వాటా ఉంటే. ఆ 33 శాతంలో 50శాతం రిజర్వేషన్ ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు కేటాయించాలి. ఈ నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ మహిళా విభాగం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సంక్షేమం కోసం నిరంతర పోరాటం జరుపుతోంది.
మరోవైపు రాష్ట్రంలో మహిళ పరిస్థితి రోజురోజుకు అధ్వాన్నంగా మారుతోంది. ఒకవైపు సరైన విద్యా, వైద్య సౌకర్యాలు లేకపోవడంతో ఆడపిల్లల చదువులు కుంటుపడుతున్నాయి.
విద్య మీద సరైన బడ్జెట్ కేటాయించని సర్కార్. మద్యం మీద మాత్రం భారీగా దృష్టి సారించింది. ఫలితంగా ఇవాళ తెలంగాణలో మంచినీళ్లు దొరకని పల్లెలు ఉన్నాయిగానీ, మద్యం దొరకని పల్లెలు లేవు. గల్లీ గల్లీకో బెల్టు షాపు ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచుతోంది. ఇట్లా భర్త అకాల మరణం పాలైతే కుటుంబాన్ని పోషించలేక అవస్థలు పడుతున్న దళిత, గిరిజన ఆడబిడ్డల సంఖ్య తెలంగాణలో లక్షల్లో ఉంది. మరోవైపు ఆడబిడ్డలకు తెలంగాణలో ఎలాంటి రక్షణ లేకుండాపోయింది. యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో మరియమ్మ అనే దళిత మహిళను లాకప్ డెత్ చేసిన ఘటన నుండి, మొన్నటికి మొన్న లక్ష్మీ అనే బంజార ఆడబిడ్డను నిష్కారణంగా స్టేషన్ తీసుకెళ్లి విపరీతంగా కొట్టడం దాకా కోకొల్లలుగా ఉదంతాలున్నాయి. అందుకే ఇవాళ మేం అడుగుతున్నాం.

మహిళల రక్షణను పట్టించుకునే మహిళా కమీషన్ అనే స్వయం ప్రతిపత్తి గల సంస్థ తెలంగాణలో ఎందుకు నిర్వీర్యం అవుతోంది? మహిళా శిశు సంక్షేమ మంత్రికి స్వంత నిర్ణయాలు తీసుకునే హక్కు, స్వేచ్ఛ ఉందా? లిక్కర్ స్కాం చేసిన కవితను ఎమ్మెల్సీ పదవి నుండి భర్తరఫ్ చేయకుండా యావత్ మహిళా లోకానికి చెడ్డ పేరు తెచ్చారు. బీఆర్ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మహిళల శాతం ఎంత? 33% రిజర్వేషన్లు ఎందుకు పాటించలేదు? మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదు? హిందుకోడ్ బిల్ తెస్తే అడ్డుకుని, అంబేడ్కర్ మంత్రి పదవికి దూరవమయ్యేలా చేసిన కాంగ్రెస్ పార్టీని మహిళలు ఎలా నమ్మాలి? బిల్కిస్ బానో కేసు నిందితులను వదిలి. పూలదండలతో ఊరేగించిన బీజేపీ స్త్రీల పక్షాన నిలబడుతుందా? మణిపూర్ లో మహిళల నగ్న ఊరేగింపులు చూస్తూ ఊరుకున్న మోడీ ప్రభుత్వం మహిళలకు న్యాయం చేస్తుందా? మహిళలు కేవలం వంటింటికే పరిమితం కావాలనే సనాతన ధర్మాన్ని నమ్మే సిద్ధాంత పునాదులపై ఏర్పడ్డ ఆధిపత్య పార్టీలు న్యాయం చేయగలవా? చేయలేవు. అందుకే బహుజన్ సమాజ్ పార్టీ మహిళా విభాగం తరుపున ఈ క్రింది డిమాండ్లను పెడుతున్నాము.

మహిళా స్వయం సంవృద్ధి సాధికారత,మహిళలకు 100% నాణ్యమైన విద్య,ప్రతీ తల్లికి, ప్రతీ చెల్లికి బలమైన ఆహారం, ఆరోగ్యం
మహిళలకు అధికారంలో, సంపదలో సమాన వాట,తెలంగాణ గల్లి గల్లిలో ఉన్న బెల్ట్ షాపులను రద్దు చేయాలి. సంపూర్ణ మద్యపాన నిషేధం మొదలైన ప్రధాన డిమాండ్స్ తో కార్యక్రమం నిర్వహించబోతున్నట్టు,
ఈ కార్యక్రమానికి వెలది మహిళా నాయకులూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలిపారు.

You may also like...

Translate »