రేపు సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్

Image Source | The Hans India

వినాయకుడి నిమజ్జనం సందర్భంగా వైన్‌షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లను మూసివేస్తు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల 28వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 29వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులను మూసివేస్తు ఆదేశాలు జారీ చేశారు.

స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మినహాయింపు ఉందని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..

You may also like...

Translate »