22 న అందోల్ కి డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాక.

ఈ నెల 22 వ తేదీన అందోల్ లో జరిగే శక్తి ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిధి గా బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వొస్తున్నట్టు అందోల్ అసెంబ్లీ ఇంచార్జి ముప్పురపు ప్రకాశం తెలిపారు.
ఉదయం 11:00 గంటలకు అందోల్ ఆర్ డి ఓ కార్యాలయం నుండి జోగిపేట అంబెడ్కర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ,కళాకారుల కళ ప్రదర్శనతో బహుజన శక్తి ప్రదర్శన ఉండబోతుందని ఈ కార్యక్రమంలో వెలది మంది బహుజన బిడ్డలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అనంతరం జోగిపేట పట్టణం లోని శ్రీరామ ఫంక్షన్ హాల్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు వెలది SC,ST,BC మైనార్టీ లు పాల్గొననున్నారని,1000 మంది బీజేపీ,కాంగ్రెస్ మరియు BRS పార్టీ నాయకులూ జాయిన్ అవ్వబోతున్నట్టు తెలిపారు.
2024 ఎన్నికలలో అందోల్ లో బహుజన జండా పాతి తీరుతామని బహుజన బిడ్డలం అందరం ఏకమై కెసిఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి సచివాలయాన్ని బహుజన సచివాలయంగా మర్చి మహనీయుల కలలను సజీవ పరుస్తామని,వేల ఎల్లా మా అమాయకత్వానికి బలమైన నాయకుడు తోడై మా వెన్ను దన్నుగా డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారన్నారు.
కావునా ఈ కార్యక్రమం లో వేలాదిగా బహుజనులందరు పాల్గొని బహుజన శక్తి ప్రదర్శనను విజయవంతం చేయాలనీ కోరారు.