సంక్రాంతి సెలవుల శుభవార్త

- జనవరి 10–15 సెలవుల సూచన
- త్వరలో నోటిఫికేషన్
- స్కూళ్లు–కళాశాలలకు వర్తింపు
- ఏపీలో 10–18 సెలవులు ఇప్పటికే
- విద్యార్థుల్లో ఉత్సాహం
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :
తెలంగాణ విద్యార్థులకు సంక్రాంతి సందర్భంగా శుభవార్త అందింది. రాబోయే జనవరిలో విద్యా సంస్థలకు దాదాపు ఆరు రోజులపాటు సెలవులు ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం. ప్రాథమిక అంచనాల ప్రకారం పెండింగ్‌లో ఉన్న అకడమిక్ షెడ్యూల్‌ను పరిశీలించిన అధికారులు జనవరి 10 నుండి జనవరి 15, 2026 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ వెలువడనుంది.
అటు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే సంక్రాంతి బ్రేక్‌ను జనవరి 10 నుండి 18 వరకు ప్రకటించింది. రెండు రాష్ట్రాల్లోనూ విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో పండుగ ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. సంవత్సరం అంతా పాఠశాల కార్యకలాపాలలో బిజీగా గడిపిన విద్యార్థులకు ఈ ఆరు రోజుల విరామం చిన్న సెలవుల సందడి తెచ్చిపెట్టనుంది.
సంక్రాంతి వేళ కుటుంబ సభ్యులతో కలిసి పండుగ సంబరాలు చేసుకునేందుకు సమయం దొరకడం విద్యార్థుల్లో ఆనందాన్ని మరింత పెంచుతోంది. సెలవుల తేదీలపై క్లారిటీ కోసం అందరూ ఎదురు చూస్తుండగా, అధికారిక ప్రకటన వెలువడగానే విద్యాసంస్థలు కూడా తమ అకడమిక్ క్యాలెండర్‌ను సవరించేందుకు చర్యలు తీసుకోనున్నాయి.
