కొత్తూరు లో తాపీ మేస్త్రి దారుణ హత్య

జ్ఞానతెలంగాణ,కొత్తూరు :

కొత్తూరు మండల కేంద్రంలోని పెద్దమ్మ తండా రోడ్డుకు ఆనుకొని ఉన్న వింటేజ్ వెంచర్ లో ఘోర హత్య సంభవించింది. సమాచారం మేరకు ఒక తాపీ మేస్త్రిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం మేరకు కొత్తూరు పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతుడు బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు పొందినట్లు పోలీసులు తెలిపారు.మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

You may also like...

Translate »