కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరణ

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో కొత్త మంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించనున్నారు. గత నెల 31న రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో ఆయన ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.ప్రభుత్వం ఆయనకు మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు కేటాయించింది. దీంతో అజహరుద్దీన్ తెలంగాణ మంత్రివర్గంలో కీలక స్థానాన్ని దక్కించుకున్నారు.
ప్రస్తుతం అజహరుద్దీన్‌తో కలుపుకొని క్యాబినెట్ మంత్రుల సంఖ్య 15కు చేరుకుంది. ఇంకా రెండు మంత్రిపదవులు ఖాళీగా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి.ప్రజాప్రతినిధిగా, క్రీడా రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన అజహరుద్దీన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
