రేపు శంకర్‌పల్లి మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

- చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పర్యటనకు సర్వం సిద్ధం
- గ్రామాల వారీగా సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్స్ ప్రారంభం
- ₹1.5 కోట్ల నిధులతో పలు గ్రామాలకు అభివృద్ధి సౌకర్యాలు
- అభివృద్ధి పథకాలతో గ్రామీణ ప్రాంతాలకు ఊపు
జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి ప్రతినిధి, నవంబర్ 9:
చేవెళ్ల నియోజకవర్గ శాసనసభ్యులు కాలే యాదయ్య రేపు (సోమవారం, నవంబర్ 10) శంకర్‌పల్లి మండల పరిధిలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. మండలంలోని గ్రామాలకు భారీ నిధులు కేటాయించి, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్స్ వంటి పౌర సదుపాయాల పనులను ప్రారంభించనున్నారు.
ఉదయం 8 గంటలకు శంకర్‌పల్లి మండలంలోని మహాలింగాపురం గ్రామంలో ₹30 లక్షల నిధులతో సీసీ రోడ్లు, ₹5 లక్షల నిధులతో స్ట్రీట్ లైట్స్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఉదయం 8.30 గంటలకు అలం ఖాన్ గూడ గ్రామంలో ₹10 లక్షల నిధులతో సీసీ రోడ్లు, ₹5 లక్షలతో స్ట్రీట్ లైట్స్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది.
ఉదయం 9 గంటలకు చందిప్ప గ్రామంలో ₹10 లక్షల నిధులతో సీసీ రోడ్లు, ₹5 లక్షలతో స్ట్రీట్ లైట్స్ పనులను ప్రారంభిస్తారు. తరువాత ఉదయం 10 గంటలకు కొండకల్ గ్రామంలో ₹10 లక్షల నిధులతో సీసీ రోడ్లు, ₹5 లక్షల నిధులతో స్ట్రీట్ లైట్స్ శంకుస్థాపన జరుగుతుంది.
ఉదయం 10.30 గంటలకు ఇరుకుంట తండాలో ₹10 లక్షల నిధులతో సీసీ రోడ్లు, ₹5 లక్షలతో స్ట్రీట్ లైట్స్ పనులు ప్రారంభమవుతాయి. అదే రోజు ఉదయం 11 గంటలకు దొంతనపల్లి గ్రామంలో ₹10 లక్షల నిధులతో సీసీ రోడ్లు, ₹5 లక్షల నిధులతో స్ట్రీట్ లైట్స్ శంకుస్థాపన చేయనున్నారు.
తదుపరి ఉదయం 11.30 గంటలకు గోపులారం గ్రామంలో ₹20 లక్షల నిధులతో సీసీ రోడ్లు, ₹5 లక్షల నిధులతో స్ట్రీట్ లైట్స్ పనులు ప్రారంభమవుతాయి. చివరగా మధ్యాహ్నం 12.30 గంటలకు చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని చేవెళ్ల సహకార సంఘం కార్యాలయంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కాలే యాదయ్య ప్రారంభించనున్నారు.
ఈ పర్యటనలో ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక అధికారులు పాల్గొననున్నారు. అభివృద్ధి పథకాలు గ్రామీణ ప్రాంతాల పురోగతికి దోహదం చేస్తాయని, ప్రజలతో కలసి ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామన్నారు.
