భార్యపై అనుమానంతో బ్యాట్ తో కొట్టి చంపిన భర్త

అమీన్ పూర్, నవంబర్ 9( జ్ఞాన తెలంగాణ) :
భార్య పై అనుమానంతో భర్త భార్యను హత్య చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం చేసుకుంది.అమీన్ పూర్ సీఐ నరేష్ అందించిన సమాచారం ప్రకారం కేఎస్ఆర్ కాలనీ లో నివాసముండే భార్యాభర్తలు కృష్ణవేణి బ్రహ్మయ్య గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు.భార్య కృష్ణవేణి కోహిర్ డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తుంది.గత కొంతకాలంగా బ్రహ్మయ్య భార్య కృష్ణవేణి పై అనుమానం పెంచుకున్నాడు. ఆదివారం ఉదయం ఈ విషయమే ఇద్దరి మధ్య గొడవ జరగడంతో బ్యాడ్ తో కృష్ణవేణి పై దాడి చేసి హత్య చేశాడు.వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బ్రహ్మయ్యను అదుపులకు తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
