సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ వివాహ వేడుకలో భీమ్ భరత్ హాజరు

సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ వివాహ వేడుకలో భీమ్ భరత్ హాజరు
జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీమ్ భరత్ పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన భీమ్ భరత్‌ను అనంతరం తిరుపతి రెడ్డి ఆప్యాయంగా పలకరించి స్నేహపూర్వకంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, మొయినాబాద్ మండలం అధ్యక్షుడు మానయ్య, షాబాద్ మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నయ్య, నాయకుడు నర్సింలు, చేవెళ్ల యూత్ కాంగ్రెస్ నాయకులు పెంట రెడ్డి, సంతోష్ రెడ్డి, చేవెళ్ల మండలం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.
