రేవంత్–కిషన్ వాగ్వాదం తీవ్రం

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్ :

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ముందుగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ తమ ఎన్నికల హామీ కాదని స్పష్టం చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని రేవంత్‌కు కిషన్ రెడ్డి హితవు పలికారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్లు, వాగ్దానాలపై చర్చకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు.

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని రేవంత్ చేసిన ఆరోపణలను కిషన్ రెడ్డి ఖండించారు. కేసీఆర్, హరీశ్ రావుల అరెస్టులపై రేవంత్ విసిరిన సవాల్‌కు ఇచ్చిన ఆయన ప్రతిస్పందనతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదురింది.

You may also like...

Translate »