జాగృతి టీచర్స్ ఫెడరేషన్‌కి కొత్త కమిటీ

– నియామకాలు ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత


జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 2:

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంస్థలో మార్పులు చేపట్టారు. జాగృతి కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆమె కీలక నియామకాలు చేశారు. ఈ మేరకు జాగృతి అనుబంధ విభాగమైన జాగృతి ఉపాధ్యాయుల సమాఖ్య (టీచర్స్ ఫెడరేషన్)‌కి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించారు.జాగృతి సంస్థ విద్యా అభివృద్ధి, సాంస్కృతిక చైతన్యం, సామాజిక పురోగతికి నిరంతరం కృషి చేస్తోందని కవిత పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని, అందువల్ల ఈ విభాగం బలపడటం అత్యంత అవసరమని ఆమె వ్యాఖ్యానించారు.

కొత్త కమిటీలో మోరం వీరభద్రరావు అధ్యక్షుడిగా, బుర్ర రమేష్ గౌడ్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అలాగే జాడి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా, ఘనపురం దేవేందర్ కోశాధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు.ఈ నియామకాలన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయని కవిత స్పష్టం చేశారు. విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కొత్తగా నియమితులైన బాధ్యులు కృషి చేయాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపునకు, ఉపాధ్యాయుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు జాగృతి ఉపాధ్యాయుల సమాఖ్య చురుకైన పాత్ర పోషించాలి అని కవిత పిలుపునిచ్చారు.

You may also like...

Translate »