భార్యను కొట్టి చంపిన భర్త

- పరడ గ్రామంలో చోటు చేసుకున్న ఘటన
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, నవంబర్ 1 :భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైన సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం పరడ గ్రామంలో శనివారం తెల్లవారుజాముల చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామానికి చెందిన వేముల సుమలత(30)ను కట్టంగూర్ మండలం పరడ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ పరడ మహేష్ కు ఇచ్చి 2024 డిసెంబర్ 6న వేములకొండ గుట్టపై వివాహం జరిపించారు. గత కొంత కాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం ఉదయం మృతురాలి సోదరి సుజాతతో పాటు ఆమె బంధువులకు మహేష్ ఫోన్ చేసి రాత్రి సుమలత కొట్టి చంపానని వచ్చి తీసుకెళ్లాలని తెలిపాడు. దీంతో వారు 100కు డయల్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించడగా సుమలత చెవి, మెడ, వెన్నుపూసపై బలమైన గాయాలై అక్కడికక్కడే చనిపోయింది. సుమలతను చంపిన అనంతరం మహేష్ ఆమె మీద ఉన్న బంగారు ఆభరణాలను తీసుకొని పరారయ్యాడు. తన కూతురు హత్యకు కారణమైన మహేష్ పాటు అతని సోదరులు మురళి, గిరి, అత్తమామలపై మృతురాలి తల్లి వేముల మారెమ్మ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. నకిరేకల్ ఇన్ చార్జి సీఐ వెంకటేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి గ్రామంలో గొడవలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో మహేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భార్యను వేదించడంతో ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
