అన్ని పథకాల్లో మహిళలకు సముచిత న్యాయం : ఎమ్మెల్యే పోచారం

జ్ఞాన తెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి, అక్టోబర్ 24:
రాష్ట్రంలో అమలవుతున్న అన్ని పథకాల్లోనూ మహిళలకు సముచిత న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలో రూ. 19 లక్షల ఎస్ డి ఎఫ్ నిధులతో నూతనంగా నిర్మించిన మహిళ భవనాన్ని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళా సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త భవనం మహిళా సంక్షేమ కార్యక్రమాలు, స్నేహ సమూహ సమావేశాలు సామూహిక కార్యక్రమాలను ఉపయోగపడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ వస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో వేగవంతమైన పురోగతి ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏరువాల కృష్ణారెడ్డి, రవీందర్, ఖలేక, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »