లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 3 : జాతిపిత మహాత్మగాంధీ జయంతి వేడుకలు గురువారం కట్టంగూర్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళర్పించారు. అనంతరం 25 మంది వృద్దులకు దోతులు పంపిణీ చేసి సన్మానం చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు చిక్కు శేఖర్ మాట్లాడుతూ మహాత్మ గాంధీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం సాధించామన్నారు. ప్రతి ఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందని, ఆయన చూపిన సత్యం, ధర్మం, అహింసా మార్గాలను అనుసరించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జెల్లా ముత్తి లింగయ్య, లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి సాగర్, కల్లూరి వెంకన్న, కోశాధికారి పోగుల రాములుగౌడ్, సభ్యులు కడవేరు మల్లికార్జున్, రాపోలు వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి వెంకన్న, చెరుకు శ్రీను, మంగదుడ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »