టీజీపీఎస్సీ రాజకీయ సంస్థగా వ్యవహరించడం బాధాకరం : విష్ణువర్ధన్ యాదవ్

జ్ఞానతెలంగాణ,నాగర్ కర్నూల్ :
నాగర్ కర్నూల్ జిల్లా సింగిల్ విండో ఫంక్షన్ హాల్ లో స్వేరోస్ నాయకులు గ్రూప్-1 పరీక్ష అవకతవకలపై మీడియా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన స్వేరోస్ ఫిట్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి తోకల విష్ణువర్ధన్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ,టీజీపీఎస్సీ రాజకీయ సంస్థగా వ్యవహరించడం పై ధ్వజమెత్తారు,గ్రూప్-1 ఉద్యోగం కోసం 3 కోట్ల రూపాయలు రాష్ట్ర మంత్రుల ద్వారా ఉద్యోగాన్ని కొల్లగొడుతూ,నిజమైన నిరుద్యోగులకు తీవ్రను నష్టం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు,ఇలాంటి అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డపాకుల శివశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం కావాలనే జీవో నెంబర్ 29 తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ,బీసీ విద్యార్థులకు తీవ్రని నష్టం జరిపారని,లక్షలాదిమంది నిరుద్యోగులకు నోట్లో మట్టి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీవో నెంబర్ 29 రద్దుచేసి గ్రూప్-1 ఎగ్జామ్ ని తిరిగి నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ మబ్బు రాము, బాలపిరు యాదవ్,వంగూరు మండల అధ్యక్షుడు దార్ల కాశయ్య, పులిజాల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.