జలతరంగాల్లో జ్వలించిన ప్రొద్దుటూరు గంగతెప్ప పూజ

- జలతరంగాల్లో జ్వలించిన ప్రొద్దుటూరు గంగతెప్ప పూజ
- సంస్కృతి–సంప్రదాయాలకు అద్దం పట్టిన ప్రొద్దుటూరు గంగతెప్ప కార్యక్రమం
- భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రొద్దుటూరు గ్రామ ప్రజలు
ఙ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి:
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్ పల్లి మండలానికి చెందిన ప్రొద్దుటూరు గ్రామంలో ఆదివారం ఉదయం విశేషమైన దృశ్యం ఆవిష్కృతమైంది. వర్షాలు కురిసి గ్రామ పెద్ద చెరువు నిండిపోవడంతో గ్రామ ప్రజలు ఆనందోత్సాహాలతో గంగతెప్ప పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన వేద బ్రాహ్మణుడు వెంకటకృష్ణ పంతులు చేతుల మీదుగా ఘనంగా జరిపించారు. ఆయన వేదమంత్రాలు ఉచ్ఛరిస్తూ పూజా కార్యక్రమాలు నడిపించగా, గ్రామస్తులంతా ఒకే స్వరంతో మంత్రోచ్ఛరణలో భాగస్వామ్యమయ్యారు. చెరువులో నిలబడి, జలతరంగాల నడుమ వినిపించిన ఆ మంత్రధ్వనులు వాతావరణాన్ని పవిత్రతతో నింపాయి.
ఈ పూజలో గ్రామ ప్రజలందరూ సామూహికంగా ఐక్యతతో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్దలు, యువకులు, చిన్నారులు ప్రతి ఒక్కరూ పూజలో పాల్గొనడం ద్వారా ప్రొద్దుటూరు గ్రామం ఐక్యతకు నిదర్శనమైంది. చెరువు జలాల్లో దీపాల కాంతులు తళుక్కుమన్న క్షణాల్లో, పూజ అనంతరం అందరూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ప్రొద్దుటూరు గ్రామం కేవలం పూజలు, ఆచారాలకే ప్రసిద్ధి కాదు ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక విలువలు కూడా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. పండుగలు వచ్చినప్పుడు గ్రామమంతా కలసి ఉత్సవంలా జరుపుకోవడం, ఆచారాలు వచ్చినప్పుడు పెద్దలు, చిన్నవారు భేదం లేకుండా భాగస్వామ్యం కావడం ప్రొద్దుటూరు గ్రామం విశిష్టత. పల్లెటూరి సౌందర్యంతో పాటు ఇక్కడి ప్రజల మనస్పూర్తి సహకారం, పరస్పర గౌరవం, కలసికట్టుగా ముందుకు సాగే తత్వం గ్రామాన్ని ఆదర్శంగా నిలబెట్టాయి.
గ్రామ పెద్దలు మాట్లాడుతూ .. ,చెరువు నిండితే అన్నదాతలకు ఆశ, గ్రామానికి ఐశ్వర్యం, మన అందరికీ శాంతి కలుగుతుంది. గంగమ్మ కృపతో ప్రొద్దుటూరు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. పంటలకు సమృద్ధిగా నీరు లభిస్తుందని నమ్ముతున్నాం” అని శాంతిలోషం వ్యక్తం చేశారు.
గంగతెప్ప పూజ కార్యక్రమం కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా గ్రామ జీవన విధానానికి అద్దం పట్టింది. ప్రకృతి పట్ల గౌరవం, సంప్రదాయ పట్ల భక్తి, సమాజ పట్ల ఐక్యత ఈ కార్యక్రమం ద్వారా ప్రతిబింబించాయి. సంస్కృతి సంపద, ఐక్యతా భావం, సంప్రదాయాల పట్ల భక్తి, తో జరిగిన ఈ పూజా ఘట్టం ప్రొద్దుటూరును మరోసారి గ్రామీణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిపింది.
ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు గ్రామ మాజీ సర్పంచ్ ఏనుగు నర్సింహా రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సురకంటి మల్లారెడ్డి, మాజీ వార్డు సభ్యులు కవేలి రాం రెడ్డి, అజేందర్ రెడ్డి, చాకలి రాములు, మాజీ కో ఆప్షన్ మెంబర్ కవేలి జంగారెడ్డి, బిజెపి మండల పార్టీ ఉపాధ్యక్షులు పులకండ్ల రఘుపతి రెడ్డి, పట్టం మోహన్ రెడ్డి, పులకండ్ల గోపాల్ రెడ్డి, మేకల రఘుపతి రెడ్డి, ఏనుగు గోవర్ధన్ రెడ్డి, మన్నె మహేందర్, చాకలి అనంతయ్య, ల్యాగల హన్మంత్, కారోబార్ ల్యాగల మల్లేష్, ఏనుగు సంజీవ రెడ్డి, మ్యాకల బల్వంత్ రెడ్డి, దర్ని కృష్ణ, పి.హరిశంకర్ రెడ్డి, కృష్ణ మనోహర్ రెడ్డి, మోటె యాదయ్య, కుమ్మరి సత్యనారాయణ, అల్లాడ రజినీకాంత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, పులకండ్ల శ్రీనివాస్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు