యూరియా కోసం రైతుల ఎదురుచూపు

జ్ఞాన తెలంగాణ,షాబాద్,సెప్టెంబర్ 1:
సోమవారం షాబాద్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఎరువుల కోసం రైతులు వందల కొద్ది రైతులు గంటలు తరబడి లైన్లో నిలుచున్నారు మహిళలు వృద్ధులు ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు . సమయానికి పంటకు అందించవలసిన ఎరువులు అందగా పంటలు నష్టపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుండి గంటల తరబడి లైన్లో నిలబడిన నాలుగువందల బస్తాల ఎరువులు ఎవరికి సమిష్టిగా సరిపోక సగం మంది రైతులు నిరాశతో వెనుతిరిగారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించకపోతే మరొకసారి రోడ్డుపై కూర్చొని పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని రైతులు తెలిపారు.