తెలంగాణాలో లక్షకుపైగా పనుల జాతర..

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలు, అంగన్వాడీలు, రోడ్లు, గ్రామీణ ప్రాంతాల సమస్యలను పరిష్కరించడం కోసం పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో పనుల జాతర ఘనంగా ప్రారంభం అయింది.
2 వేల 198 కోట్ల రూపాయిలతో లక్షకు పైగా పనుల జాతర పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖల ఆద్వ‌ర్యంలో గత ఏడాది నిర్వహించిన ప‌నులను మంత్రులు, శాసనసభ్యులు ప్రారంభోత్సవాలు చేశారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో పనుల జాతర కింద చేపట్టిన పనులకు శంకుస్థాపనలు చేశారు. కాగా ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 198 కోట్ల రూపాయిలతో లక్షకు పైగా పనులను చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
పనుల జాతర ఉద్దేశం ఇదే గ్రామాలలో ప్రజలకు ఉపాధి కల్పనతో పాటూ ప్రగతి సాధన పనుల జాతర ఉద్దేశ్యమని పేర్కొన్నారు. మొత్తం 2, 198 కోట్ల రూపాయలతో లక్ష పైగా పనులకు శ్రీకారం చుట్టారు. పనుల జాతర తో పాటుగా ఉపాధి హామీ పథకం, స్వచ్ఛభారత్ మిషన్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ, గ్రామీణ మంచినీటి సరఫరా వంటి కీలక విభాగాల ద్వారా ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూర్చే పనులను కూడా ప్రారంభించనున్నారు. ప్రజా ప్రతినిధులు సక్సెస్ చేయాలన్న మంత్రి సీతక్క ప్రజలకు ఉపాధి కల్పనతో పాటు, గ్రామీణ అభివృద్ధికి ఈ పనుల జాతర కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇది రాజకీయాలకు అతీతమైన పండుగ అని ఈ పనుల జాతరలో ఎమ్మెల్యేలు అందరూ పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా ఉత్తరాలు రాశామని ఈ కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు సక్సెస్ చేయాలని మంత్రి సీతక్క కోరారు.
రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలన్న సీతక్క పల్లెల్లో ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు, ఉపాధి అవకాశాల కల్పనకు, జల సంరక్షణకు, వ్యవసాయ అభివృద్ధికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. ప్రజా ప్రతినిధులందరూ రాజకీయాలను పక్కనపెట్టి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, రాష్ట్ర అభివృద్ధికి పనుల జాతర బాటలు వేస్తుందని మంత్రి సీతక్క అభిప్రాయం వ్యక్తం చేశారు.

You may also like...

Translate »