ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి…మరొకరికి పరిస్థితి విషమం

ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి…మరొకరికి పరిస్థితి విషమం
జ్ఞానతెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి,ఆగస్టు 21 :
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి చెందారు. ఈ ఘటన బాన్సువాడ మండలంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బాన్సువాడ మండలంలోని బొర్లం క్యాంప్ శివారులో ఆర్టీసీ బస్సు టీవీఎస్ ఎక్సెల్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాన్స్వాడ మండలం సోమ్లా నాయక్ తండకు చెందిన రామావత్ గోవింద్ మృతి చెందారు. రమావత్ రాములు పరిస్థితి విషమంగా ఉండడంతో నిజాంబాద్ ఆసుపత్రికి తరలించారు. మరో బైక్ పై ఉన్న ఇద్దరికీ సైతం గాయాలయ్యాయి. బొర్లం క్యాంప్ శివారులో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండడంతో వేరే మార్గం ద్వారా ద్విచక్ర వాహనాలు దారులు వెళ్లే ప్రయత్నంలో కామారెడ్డికి వెళ్తున్న బస్సు ఢీ కొట్టింది. అనంతరం గ్రామస్తులు గోవింద్ మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.