పండగలకు భారీ బందోబస్తు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : వినాయక చవితి, మిలాద్ ఉల్ నబీపండగల సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు అధికారులను ఆదేశించారు. కమిషర్ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసే గణేశ్ మండపాల వద్ద భద్రత, బందోబస్తు, ఏర్పాట్లపై సమీక్షించారు.గణేష్ ఉత్సవాల సమయంలోనే మిలాద్ ఉన్ నబీ పండగ వస్తుందని, ఈ సమయంలో నిర్వహించే ర్యాలీల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గణేశ్ మండపాల వద్ద విద్యుత్ వంటి ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను కోరారు