సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర నేటి బహుజనులందరికి స్ఫూర్తిదాయకం

  • కల్లేపు ప్రణీత్ గౌడ్- లా విద్యార్థి.
  • మొదటి తెలుగు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర నేటి బహుజనులందరికీ స్ఫూర్తిదాయకమని కల్లేపు ప్రణీత్ గౌడ్ అన్నారు.

వరంగల్ జిల్లా,చెన్నారావుపేట మండలం, కోనాపురం గ్రామానికి చెందిన కల్లేపు ప్రణీత్ గౌడ్ బహుజనులందరికీ బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం అధికారికంగా నిర్వహించే పాపన్న జయంతి సందర్భంగా బహుజనులందరూ ఆయన చరిత్రను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ: మొట్టమొదటి తెలుగు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, పూర్వం వరంగల్ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా, రఘనాథపల్లి మండలం, ఖిలాషాపూర్ గ్రామంలో 18 ఆగస్టు 1650లో జన్మించిన పాపన్న.తన చిన్నతనంలోనే తండ్రి ధర్మన్న గౌడ్ మరణించగా తల్లి సర్వమ్మ కోరిక మేరకు కల్లుగీత వృత్తిని కొనసాగిస్తూ సామాజిక, ఆర్థిక, రాజకీయాలను గమనించేవాడు.తురుష్క సైనికులు రైతుల నుండి భూమి పనులు, కల్లుగీత కార్మికుల నుండి చెట్టు పన్నులను వసూలు చేస్తూ ప్రజలను పీడిస్తున్న సమయంలో దోపిడి వ్యవస్థకు కల్లు గీసే కత్తిని ఖడ్గంగా మార్చి తురుష్క సైనికులపై తిరగబడి దోపిడీ చేసిన ధనాన్ని తిరిగి ప్రజలకు పంచిన ఘనత ఆయనదని, వివిధ కులాల మిత్రులతో కలిసి గెరిల్ల సైన్యాన్ని స్థాపించి తురుష్క, భూస్వాముల, జమీందారులు, జాగిదారులను ఎదిరించి వారి సంపదను పేద ప్రజలకు పంచుతూ, అభివృద్ధి పనులు చేస్తూ, బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేశాడని, పోరాటాలు చేసి గోల్కొండ కోటపై బహుజన జండా ఎగరవేసిన తొలి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.కుల మత వర్గ బేధాలు లేకుండా బహుజనులంతా ఏకమై తమ హక్కుల కోసం పోరాడి నాయకుడిగా ఎదగాలని కోరిన వ్యక్తి పాపన్న గౌడ్. నేడు ఆయన చరిత్రను స్మరిస్తూ భవిష్యత్ తరాలకు ఆయన చరిత్రను తెలిపి, ఆయనను ఆదర్శంగా తీసుకొని బహుజనులంతా రాజ్యాధికారం కోసం పోరాడాలని కోరారు.


కల్లేపు ప్రణీత్ గౌడ్- లా విద్యార్థి.

You may also like...

Translate »