తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఈసారి దసరా సెలవులు భారీగానే ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ మూడోవారం నుంచి రెండు రాష్ట్రాల్లో స్కూళ్లకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏపీలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు. క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు హాలీడేస్ ప్రకటించనున్నారు.ప్రత్యేక పండుగలు, ఆదివారాలు ,రెండో శనివారాలు అన్ని కలిపితే విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. మొత్తంగా ఈ అకాడమిక్ క్యాలెండర్‌లో 233 వర్కింగ్ డేస్ ఉండగా.. 83 రోజులు సెలవులు వచ్చాయి.