పోచారం ప్రాజెక్టును పరిశీలించిన డి.ఎస్.పి

జ్ఞాన తెలంగాణ,నాగిరెడ్డిపేట్ ప్రతినిధి, ఆగస్టు 16:
మండలంలోని పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లడంతో ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు,ఇరిగేషన్ డిఈ. వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసరావు పోచారం ప్రాజెక్టు ఆయకట్టు రైతులు రైతులు అప్రమత్తంగా ఉండాలని మంజీరా తీర ప్రాంతం వైపు ఎవరు వెళ్లకూడదని తెలిపారు.ప్రాజెక్టు వైపు రెండు వైపుల ఎవరు వెళ్ళకూడదని పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సిఐ రాజారెడ్డి,స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్,ఇరిగేషన్ ఏఈ అశ్విన్ ఉన్నారు.

You may also like...

Translate »