తాటిపల్లి-మక్త క్యాసారం రోడ్డుకు రూ.22 కోట్లు మంజూరు

తాటిపల్లి-మక్త క్యాసారం రోడ్డుకు రూ.22 కోట్లు మంజూరు


జ్ఞానతెలంగాణ, స్టేట్ బ్యూరో:
తాటిపల్లి-మక్త క్యాసారం రోడ్డుకు రూ.22 కోట్లు మంజూరు మునిపల్లి మండలం తాటిపల్లి నుంచి మక్త క్యాసారం వరకు రెండు వరుసల రహదారి నిర్మాణానికి రూ. 22 కోట్లు మంజూరయ్యాయని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ రోడ్డు విస్తరణ వలన ఆయా గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి ఆదేశాల మేరకు, ఆర్&బి అధికారులు వెంటనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసి, రహదారి పనులను ప్రారంభించాల్సి ఉంది.

You may also like...

Translate »