లోకేష్ కు హారీశ్ రావు కౌంటర్

  1. కాళేశ్వరానికి అనుమతులున్నయ్
  2. ప్రాజెక్ట్ అడ్డుకునేందుకు చంద్రబాబు ఏడు లేఖలు రాశారు
  3. ఒకసారి చరిత్ర తెలుసుకోవాలని హితవు
  4. మిగులు జలాలు ఉంటే బనకచర్లకు కేంద్రం ఎందుకు నో చెప్పింది

జ్ఞానతెలంగాణ,హైరాబాద్ : బనకాచర్ల విష యంలో మంత్రి నారా లోకేష్ అబద్దాలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మిగులు జలాలుంటే ఆ ప్రాజెక్టు అనుమతికి కేంద్ర జ ల సంఘం ఎందుకు నిరాకరించిందని ప్ర శ్నించారు.. శుక్రవారం మీడియాకు నోట్ విడుదల చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పొక్క కొట్టి తీసుకుపోతున్నామా? అన్న లోకేష్కు పొక్క కొట్టేందుకు ఇది ఏమైనా శ్రీశైలం ప్రాజెక్టా? పోతిరెడ్డిపాడు ప్రాజెక్టా? ఇదేమైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశా? కాళేశ్వరం ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.. దీనికి పొక్కకొట్టుడు, చిల్లు కొట్టుడు ఉండదని ఘాటుగా సమాధానం ఇచ్చారు..కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి లేదని లోకేష్ మాట్లాడుతున్నారని, ఒకటి కాదు రెండు కాదు 11 అనుమతులు ఉన్నాయని హారీశ్ రావు అన్నారు. అన్ని రకాల అనుమతులు సాధించి కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్ర భుత్వం నిర్మించిందని తేల్చిచెప్పారు.. మీకు అనుమానం ఉంటే ఈ అనుమతుల లేఖలు పంపిస్తాను వెరిఫై చేసుకోవాలని సూచించారు.

You may also like...

Translate »