గురుకుల బ్యాక్ లాగ్ సీట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

- ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి
జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా, ప్రతినిధి, జూన్ 31:
ఖమ్మం జిల్లా ఏన్కూరు.ఏన్కూరు( బాలుర) వైరా (బాలికల ) గురుకుల విద్యాలయాల్లో 6,7,8 తరగతుల్లో బ్యాక్ లాక్ సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ఆహ్వానిస్తున్నట్లు ఏన్కూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ తుడి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏన్కూరు గురుకులంలో 6వ,తరగతిలో బిసి -7 సీట్లు, 7వ, తరగతిలో ఓపెన్ కేటగిరిలో 05, బిసి -2, 8వ తరగతిలో బిసి -4, ఎస్సీ -2 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వైరా బాలికల గురుకులంలో 6వ, తరగతిలో ఓసి -06, ఎస్సీ -04, బిసి -04 సీట్లు, 8వ, తరగతిలో ఓసి 04. బిసి -02, ఎస్సీ -02 సీట్లు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. నేటి నుండి జులై 2 వ తేది వరకు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. జులై 6వ, తేదీ ఉదయం 10 గంటలనుండి 11 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించడం జరుగుతుందని అన్నారు. మరిన్ని వివరాలకు ప్రిన్సిపాల్ సంప్రదించాలని కోరారు.