ప్రియురాలి ముందే ప్రియుడు ఆత్మహత్య

ప్రియురాలి ముందే ప్రియుడు ఆత్మహత్య


జ్ఞాన తెలంగాణ,పటాన్‌చెరు(వెబ్ డెస్క్) : ప్రియురాలి కళ్ల ముందే ప్రియుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పటాన్‌చెరులోని ఓ అగర్‌బత్తీల పరిశ్రమలో ఝరాసంగానికి చెందిన ఉమాకాంత్‌(25) పని చేస్తున్నాడు. అదే పరిశ్రమలో పని చేస్తున్న యువతి, అతడు మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. పెళ్లి చేసుకుందామని యువతిని అడిగాడు. ఆమె నో చెప్పడంతో మనస్థాపంతో ఉరేసుకున్నాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

You may also like...

Translate »