చేవెళ్లలో టిడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక

చేవెళ్లలో టిడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
- అధ్యక్షుడిగా రాజు, ప్రధాన కార్యదర్శిగా జయ చందర్ బాధ్యతలు స్వీకారం
- గౌరవ అధ్యక్షుడు గా చంద్రశేఖర్ – జిల్లా సభ్యుడిగా రాజశేఖర్ ఎంపిక
- నూతన కమిటీకి శుభాకాంక్షలు
చేవెళ్ల, మే 27 (జ్ఞాన తెలంగాణ – శంకర్‌పల్లి):తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) చేవెళ్ల నియోజకవర్గ నూతన కమిటీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాజు అధ్యక్షుడిగా, జయచందర్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. గౌరవ అధ్యక్షులుగా చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యుడిగా రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించారు.
నూతనంగా ఎన్నికైన సభ్యులందరికీ జర్నలిస్టు సంఘాల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, వృత్తిగతంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి పోరాట పథంలో నడవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జర్నలిస్టులకు అత్యంత కీలకమైన అక్రిడేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని, అన్ని హక్కులు సాధించేందుకు నిరంతర కృషి చేయాలని,ప్రభుత్వం తరపున జర్నలిస్టులకు లభించే హౌసింగ్, హెల్త్ కార్డులు, పింఛన్లు, ట్రావెల్ పాస్‌లు వంటి సౌకర్యాలు జర్నలిస్టులకు అందేలా చేయడంలో నూతన కమిటీ నేతలు ముందుండాలని జర్నలిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జర్నలిస్ట్ వర్గానికి మద్దతుగా, వృత్తిపరమైన గౌరవాన్ని నిలబెట్టేలా, చట్టబద్ధమైన హక్కుల సాధనలో నూతన నాయకత్వం ముందడుగు వేయాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

