యూజీసీ నెట్ (UGC NET) నోటిఫికేషన్ రిలీజ్- జూన్ పరీక్షకు ప్రక్రియ ప్రారంభం..

యువత విద్య, పరిశోధన రంగాల‌్లో కెరీర్ చేయాలనుకునే వారికి ఒక బంగారు అవకాశం లభించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ (UGC) జాతీయ అర్హత పరీక్ష UGC NET జూన్ 2025 కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది.
ఈ పరీక్ష జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవుల కోసం నిర్వహిస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు NTA అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in లోకి వెళ్లి మే 7, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈసారి UGC NET పరీక్ష జూన్ 21 నుంచి జూన్ 30 వరకు కంప్యూటర్ ఆధారిత మోడ్ (CBT) లో నిర్వహించనున్నారు. మొత్తం 85 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష జరుగుతుంది.
దరఖాస్తు సమయంలో సరైన సమాచారాన్ని అందించాలని అభ్యర్థులకు NTA సూచించింది, ఎందుకంటే అన్ని వివారలు నమోదు చేసిన మొబైల్ నంబర్, ఇమెయిల్ ద్వారా మాత్రమే పంపిస్తామని తెలిపింది. అందుకే ఆ వివరాలు నమోదు చేసేటప్పుడు పూర్తి జాగ్రత్తవహించాలని హితవుపలికింది.