కన్న కొడుకుని కత్తితో ముక్కలు ముక్కలు గానరికి చంపిన తండ్రి..
జ్ఞానతెలంగాణ,క్రైమ్ :మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకు కుటుంబ సభ్యులను చంపుతానంటూ ప్రతిరోజు గొడవ వేధిస్తుండడంతో అర్ధరాత్రి సొంత కొడుకు శ్రీకాంత్ ను చంపి పోలీసులకు లొంగిపోయిన తండ్రి వేధింపులు తట్టుకోలేక ఓ తండ్రి కొడుకును హత్య చేశాడు.ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటలో రాత్రి జరిగింది. స్థానికుల ప్రకారం..గ్రామానికి చెందిన మాదాసు శ్రీకాంత్(30) మద్యం తాగి రోజు తండ్రిని వేధించేవాడు. నిన్న రాత్రి కూడా గొడవ పడటం తో పడుకున్న శ్రీకాంత్ ను కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిస్తున్నారు.