ఫిబ్రవరి 23న గురుకులాల ప్రవేశపరీక్ష

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క


రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఐదు నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాల కోసం ఫిబ్రవరి 23న ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రవేశాలపై గ్రామాలు, నియోజకవర్గాలు, పాఠశాలల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. శనివారం ప్రజాభవన్‌లో సంక్షేమ గురుకులాల ఉమ్మడి ప్రవేశపరీక్ష గోడపత్రికను ఆవిష్కరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం కోసం 40% డైట్‌ఛార్జీలు, 200% కాస్మెటిక్‌ ఛార్జీలు పెంచామని వివరించారు

You may also like...

Translate »