మంత్రి సీతక్కను మర్యాద పూర్వకంగా కలిసిన

  • కమ్మదనం మాజీ డిప్యుటీ సర్పంచ్ కాంగ్రెస్ యూత్ మండల అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ, ఫరక్ నగర్,షాద్నగర్ ప్రతినిధి జనవరి 04:

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం మధురాపురం, గ్రామాల కు సంబంధించిన పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా రూ.35 కోట్ల 13 లక్షల రూపాయల నిధులతో బీటీ రోడ్డు సిసి రోడ్లు ఆయా ప్రభుత్వ భవనాలు ప్రారంభోత్సవ కార్యక్రమాలను చేపట్టారు. ఫరూఖ్ నగర్ మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి షాద్ నగర్ పట్టణానికి మొదటిసారి వచ్చిన సందర్భంగా మంత్రి సీతక్కాను మర్యాద పూర్వకంగా కలిసిన శాలువా పూలమాలతో సన్మానించిన కమ్మదనం మాజీ డిప్యుటీ సర్పంచ్ ఫరక్ నగర్ మండల్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొగుర్ అమర్నాథ్ రెడ్డి.
కార్యక్రమంలో దేవగిరి నవీన్, కారుకొండ రవి, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బొమ్మ అంజయ్య,అరుణమ్మ, చెన్నయ్య, కిష్టయ్య, చంద్రయ్య, నరసింహ, కృష్ణయ్య, లక్ష్మయ్య ,రాఘవేందర్, కుమార్, రాజు ,శేఖర్, శ్రీను ,రియాజుద్దీన్, లక్ష్మీ ,నరసింహ, తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

You may also like...

Translate »