ఇంగ్లిష్ ఓలంపియాడ్ టెస్ట్ లో ద్వితీయ స్థానం పొందిన జూకల్ విద్యార్థులు

జ్ఞానతెలంగాణ, చిట్యాల జనవరి 03:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల లోశుక్రవారం రోజున జరిగిన ఇంగ్లీషు ఒలంపియడు లో జూకల్ ఉన్నత పాఠశాల కు చెందిన తొమ్మిదవ విద్యార్థి జంబుల సౌమిత్ మరియు 8 తరగతి విద్యార్థి కౌటం అభిలాష్ లు ద్వితీయ స్థానం పొందారని, పాఠశాల ప్రధానోపధ్యాయులు కృష్ణ తెలియజేశారు,ఈ సందర్బంగా ప్రధానోపాధ్యాయులు కృష్ణ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థుల ను ఒలంపియడ్ కు సిద్ధం చేసిన ఇంగ్లీష్ ఉపాద్యాయులు సాదు,మమత, లు మరియు విద్యారులను టాలెంట్ టెస్ట్ నిర్వహించిన జ్యూరీ బృందం షీల్డ్ తొ సత్కరించారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి ఇంగ్లీషు ఒలంపియాడ్ కన్వీనర్ నీలిమారెడ్డి, ఉపాధ్యాయులు పావని, సాంబమూర్తి,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.