దాతృత్వం చాటుకున్న మద్దిగట్ల వాకింగ్ క్లబ్ సభ్యులు

క్లబ్ సభ్యుడి తల్లిగారి మృతికి ఆర్థిక సహాయం అందజేత


జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి,తేది :- పెద్దమందడి మండలంలోని మద్దిగట్ల గ్రామానికి చెందిన మీసాల లక్ష్మమ్మ (65) గురువారం అర్ధరాత్రి మృతి చెందడంతో ఉదయాన్నే విషయం తెలుసుకున్న వాకింగ్ క్లబ్ సభ్యులందరు బాధితుడి ఇంటికి వద్దకు చేరుకోని తక్షణ సహాయంగా రూ.5000/- రూపాయలను అందజేశారు.కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని నింపిన వాకింగ్ క్లబ్ సభ్యులు లక్ష్మమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతినీ తెలియజేశారు. ఆలాగే వీరి ఆర్ధిక సాయం అనంతరం బండేడ్ లేబర్ కాలనీ వాసులందరు కలిసి వాకింగ్ క్లబ్ సభ్యులు మీసాల పెద్ద మొగులయ్య కుటుంబానికి రూ.5500/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

You may also like...

Translate »