కర్నే తండా లిఫ్ట్ ఇరిగేషన్ సబ్ స్టేషన్ నిర్మాణానికి రూ.1కోటి 63 లక్షల మంజూరు

6 తండాలకు 4400 ఎకరాలకు అయకట్ట ద్వారా సాగునీరు అందజేత


జీవో 345 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన వనపర్తి ఎంఎల్ఏ మేఘా రెడ్డి


జ్ఞాన తెలంగాణ, వనపర్తి జిల్లా ప్రతినిధి: కర్నే తండా లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని వెంటనే మంజూరు చేయాలని కోరుతూ వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి
మెగా రెడ్డి గారు సమర్పించిన విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు స్పందించి ఉపకేంద్ర నిర్మాణానికి సంబంధించి రూ. ఒక కోటి 63 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో RT NO 345 ప్రకారం ఉత్తీర్లు జారీ చేయడం అట్లా వనపర్తి శాసనసభ్యులు తూడి మెగా రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారికి, విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ మల్లు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విదితుపకేత నిర్మాణంతో కర్ణ తండా లిఫ్ట్ ప్రారంభమవుతుందని దానితో ఇలాగన్పూర్ లోని జంగమయ్యపల్లి, దొంతికుంట తండా, కర్నే తండా, షాపూర్, మామిడి మాడ, లట్టుపల్లి లోని ఆరు తాండాలకు 4400 ఎకరాల ద్వారా ఆకటకు సాగునీరు అందజేయవచ్చునని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ పక్క నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరు చేయడానికి కృషి చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు దామోదర్ రాజ్ నరసింహ గారికి జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

You may also like...

Translate »