రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది

సీనియర్ నాయకులు జుర్కి రమేష్ పటేల్


జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29 : రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని సీనియర్ నాయకులు జుర్కీ రమేష్ పటేల్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండల పరిధిలోని పిల్లోనిగూడ గ్రామంలో ఆదివారం జరిగే రమేష్ పటేల్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెట్టింది పేరుగా నిలుస్తుందని ఆయన అన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని చర్యలు చేపడుతున్నారని ఆయన అన్నారు. అన్ని వర్గాల వారికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

You may also like...

Translate »